బిగ్ బాస్-7 కి ప్రియాంక జైన్ కన్ఫమ్.. సాక్షమిదే!
on Sep 3, 2023
ప్రియాంక జైన్.. ఇప్పుడు అందిరికీ సుపరిచితమే. బిగ్ బాస్ సీజన్-7 కంటెస్టెంట్స్ లిస్ట్ గురించి బయట ప్రచారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ చానెల్స్, సోషల్ మీడియా పేజీలలో దాదాపు అన్నింట్లో ప్రియాంక జైన్ పేరు ఉంది. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ మరో సీరియల్ నటుడు తనతో దిగిన ఒక సెల్ఫీలో ' ఆల్ ది బెస్ట్ ' అని క్యాప్షన్ పెట్టి పక్కనే హౌజ్ ఫోటో పెట్టాడు. దీంతో ప్రియాంక జైన్ కన్ఫమ్ అనే క్లారిటీ వచ్చేసింది.
ప్రియాంక జైన్ మౌనరాగం సీరియల్ తో బుల్లితెర అభిమానులకు పరిచయమైంది. మూగ అమ్మాయి పాత్రలో చేసిన ప్రియాంకకి ప్రశంసలు దక్కాయి. మౌనరాగం సీరియల్ లో శివతో కలిసి నటించింది ప్రియాంక. ఇక అప్పటినుండి వీరిద్దరు రిలేషన్ షిప్ లో ఉంటూ వస్తున్నారు. ఆ తర్వాత ప్రియాంక జైన్ జానకి కలగనలేదు సీరియల్ లో అమర్ దీప్ తో కలిసి నటించింది. ఈ మధ్యే ఈ సీరియల్ ఎండ్ అయింది. దీంతో తను బిగ్ బాస్ సీజన్-7 కి వెళ్తుందని మరొక లీడ్ వచ్చేసింది.
ప్రియాంక జైన్ కన్నడలోను పలు సీరియల్స్ లో నటించింది. తెలుగు సినిమాలలో కూడా నటించిన ప్రియాంక జైన్ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. గోలీ సోడా, చల్తే చల్తే, వినరా సోదర వీర కుమారా, ఎవడూ తక్కువ కాదు లాంటి సినిమాల్లో నటించిన ప్రియాంక జైన్ యాక్టింగ్ కి పెద్దగా స్కోప్ రాలేదు. తక్కువ స్క్రీన్ స్పేస్ లభించడంతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దాంతో సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర అభిమానులకు దగ్గరైంది. తాజాగా జనకి కలగలేదు టీమ్ లో ఒకరైన యాక్టర్ అనిల్ అల్లం తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ప్రియాంక జైన్ తో కలిసి ఒక ఫోటోని షేర్ చేశాడు. ఇప్పుడు అది వైరల్ గా మారింది. ఆల్ ది బెస్ట్ టూ హౌస్ అని మీనింగ్ వచ్చేలా ఉన్న ఆ ఫోటో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. దీంతో ప్రియాంక జైన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్టుగా అందరికి క్లారిటీ వచ్చేసింది.
Also Read